భారత మార్కెట్లోకి రానున్న పాక్ బీరు
పాకిస్థాన్ కు చెందిన బీరును భారతీయ మద్యం ప్రియులు రుచి చూడనున్నారు. పాక్ కంపెనీ ముర్రీ బ్రెవరీ.. తన బ్రాండ్ బీరును బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త మార్కెట్ చేయనున్నారు. ఈ విషయాన్ని ముర్రీ బ్రెవరీ సీఈఓ ఇష్ఫన్యర్ భండారా తెలిపారు. వాఘా-అట్టారి సరిహద్దు ద్వారా భారత్ కు బీరు ఎగుమతి చేయడానికి అవకాశం లేదని చెప్పారు. కనుక బీరును భారత్ లోనే తయారు చేసి విక్రయించేందుకు ఫ్రాంచైజీ ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. పాకిస్థాన్ చట్టాల ప్రకారం ముస్లింలు ఆల్కహాల్ తీసుకునేందుకు అనుమతి లేదని.. విదేశీయుల కోసమే తాము 5స్టార్ హోటళ్లలో విక్రయిస్తుంటామని తెలిపారు.